పవన్ కళ్యాణ్ అభిమానులు సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా విడుదలైన మొదటి నుండి మిక్స్ టాక్, ఒక రకం గా చెప్పాలంటే నెగటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ భారీగా వచ్చినా, రెండవరోజు కలెక్షన్ భారీగా పడిపోయాయి.
సినిమాకు నెగటివ్ టాక్, వర్షాలు పడుతున్నాయి, భారీగా టికెట్ ధరలు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ సినిమా మొదటి శని, ఆదివారాలు కలెక్షన్స్ మీదే హరిహర వీర మల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుంది
ఇక ఈ వీరమల్లు నేర్పిన పాఠాలు ఏమిటి, తప్పు ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం
ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టని దర్శకుడు క్రిష్ (Krish) తీసుకు వచ్చిన కధని పవన్ కల్యాణ్ నమ్మడం. గతంలో క్రిష్, బాలకృష్ణ తో తీసిన గౌతమీ పుత్ర శాతకర్ణి చూసిన తరవాత కూడా పవన్ కల్యాణ్ ఎలా ఒప్పుకున్నాడు
ఇలాంటి పిరియాడికల్ సినిమా తీయడానికి టైం పడుతుంది. అయితే రాజకీయాలు, ప్రజాసేవలో నిండా మునిగిన పవన్ కల్యాణ్ ఎలా ఒప్పుకున్నాడు
అసలు ఎలాంటి కమర్షియల్ హిట్ లేని క్రిష్, రాజకీయాలు, ప్రజాసేవలో మునిగిఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే, ఎంతో అనుభవం ఉన్న ఏ ఏం రత్నం ఎలా ఒప్పుకున్నాడు
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండడం వలన, హరి హర వీరమల్లు ఆలస్యమవుతుండడంతో, క్రిష్ ఘాటీ సినిమా చేయడానికి వెళ్ళాడు. పోనీ, క్రిష్ ఘాటీ సినిమా అయినా విడుదల అయ్యిందా అంటే అది లేదు.
ఈ లోగా మొదలు పెట్టాం కదా అని తప్పని పరిస్థితులలో ఏ ఏం రత్నం, తన కొడుకు జ్యోతి కృష్ణ ను దర్శకుడిగా రంగంలోకి తెచ్చాడు. అసలు పెద్దగా అనుభవం, ఒక్క హిట్ సినిమా కూడా తీయని జ్యోతి కృష్ణ దర్శకుడు అనగానే పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నాడు
ఒక కధ అనుకున్నాక, ఆ సినిమా పూర్తయ్యేవరకు దాని మీద నిలబడాలి. ఆలా నిలబడకుండా, తన ఆలోచనలను గాలికి వదిలేశాడు, దర్శకుడు క్రిష్
అసలు క్రిష్ ఎలాంటి కధ ఇచ్చాడు, జ్యోతి కృష్ణ ఏం మార్పులు చేశాడు, పవన్ కల్యాణ్ ఏమైనా మార్పులు చేశాడా – ఇందులో ఎవరి తప్పు ఎంత ఉందొ ఈ ముగ్గురికి తెలియాలి
ఇక హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమా విషయానికి వద్దాం. అసలు ఈ సినిమాలో కధ లేదు. సరైన భావోద్వేగాలు లేవు. క్లైమాక్స్ లో ఒక చిన్న సన్నివేశం తప్ప
రెండు పార్ట్ లు గా తీయాలన్న ఈ సినిమా మొదటి పార్ట్ లోనే రెండు సినిమాలు చూపించారు. మొదటి భాగం ఒక సినిమా, రెండవ భాగం ఒక సినిమా చూపించారు
ఈ సినిమా టైటిల్స్ వేసేముందు, పవన్ కల్యాణ్ పాత సినిమాలన్నీ చూపిస్తూ వచ్చారు. అది ఎందుకో అర్ధం కాలేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ టైటిల్ కార్డు కూడా బాలేదు
ఉన్నవాడిని దోచి లేని వాడికి పెట్టడం అనే పాత రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ బాగానే నటించాడు. అయితే. మొదటి అర్ధ భాగంలో కేవలం యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా అంత గొప్పగా లేవు. పవన్ కళ్యాణ్ బాగానే నటించిన పేస్ లో తేడాలు తెలుస్తున్నాయి. (ఐదేళ్లు తీసిన సినిమాగా)
అక్కడక్కడా పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కొన్ని బాగానే ఉన్న, సరైన కధ, భావోద్వేగాలు లేకపోవడం వలన మొదటి అర్ధ భాగం కూడా సాదా సీదాగా ఉంది
హీరోయిన్ నిధి అగర్వాల్ (పంచమి) సరైన క్యారెక్టర్ దొరకలేదు. ఈ పాత్ర ఉన్నా, లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం ఉండదు, చిత్ర నిడివి తగ్గుతుంది తప్ప.
ఇంటర్వెల్ ముందు పెద్ద పులిని రెండు వేళ్ళతో కంట్రోల్ చేసే సన్నివేశం, ఇంటర్వెల్ తరవాత, అడవిలో తోడేళ్ళ ను కంటి తో కంట్రోల్ చేసే సన్నివేశాలు అతిగా ఉన్నాయి. సహజత్వానికి దూరంగా ఉన్నాయి
రెండవ అర్ధ భాగం అంతా చిన్న, చిన్న సీన్ లతో అల్లేశారు. రెండవ అర్ధ భాగం కోహినూర్ వజ్రం కోసం, వీర మల్లు బయలు దేరడంతో మొదలవుతుంది. అకస్మాత్తుగా సినిమా సనాతన ధర్మం వైపు వెళుతుంది
చావా సినిమా తరహా లో క్లైమాక్స్ ఫైట్ అనుకున్నారు కానీ అంత బాగా రాలేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) యాక్షన్ కోరియోగ్రఫీ చేసిన క్లైమాక్స్ ఫైట్ కూడా అంత గొప్పగా లేదు
నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్ ని, ఎన్నికలలో గెలిచినా తరవాత ఆంధీ అని సంబోధించారు. దానికి వాడుకుని క్లైమాక్స్ లో తుఫాన్ సృష్టించారు. అంది ఎందుకో అర్ధం కాలేదు. చివరకు ఔరంగజేబు, వీరమల్లు ఇద్దరు చేతులు కలపాల్సి వస్తుంది (ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు మొదటి సారి బ్రిడ్జి కింద కలిసినప్పుడు ఒకరి చేతులు, ఒకరు పట్టుకుంటారు)
పాటలు కూడా అంత గొప్పగా లేవు. రెండవ అర్ధ భాగంలో నిధి అగర్వాల్ తీసిన పాట అసలు అవసరం లేదు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సన్నివేశాలు
రాజకీయాలు, సినిమాలు – రెండు పడవల మీద ప్రయాణం చేస్తే, పవన్ కళ్యాణ్ సినిమాలకు న్యాయం చేయలేడు. కధ సరిగా వినకుండా, రెమ్యూనరేషన్ తీసుకోకుండా, రాజకీయాలలో బిజీ గా ఉంటూ, ఐదేళ్లు, ఈ సినిమా కోసం పడిన శ్రమ అంత వృధా.
మరి ముఖ్యంగా అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. అభిమానులకే కాదు, నిర్మాత ఏం ఏం రత్నకు కూడ మిగిలేది భాదే
ఈ సినిమాలో ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే, అది కేవలం కీరవాణి సంగీతం మాత్రమే. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓరంగజేబు పాత్రలో బాబీ డియోల్ బాగానే నటించాడు
హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమా సగటు సినిమా ప్రేక్షకుడుకు నచ్చదు. అయితే పవన్ కళ్యాణ్ భక్తులను, పవన్ కల్యాణ్ కు మరింత దగ్గర చేరుస్తుంది. ఎందుకంటె, ఈ సినిమాలో డైలాగులు అన్నీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ పెంచడానికి తప్ప, సినిమాకు పనికిరావు.
మరో రెండు రోజుల్లో ఈ సినిమా భవితవ్యం తేలిపోతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేలుకోవాలి. సినిమాలలో నటించకపోయిన పరవాలేదు, కానీ ప్లాప్ సినిమాలలో నటిస్తే అభిమానులు తట్టుకోలేరు

