మొదటి టి 20 లో పాకిస్థాన్ కు బంగ్లాదేశ్ షాక్

by | Jul 21, 2025 | వార్తలు

పాకిస్థాన్, బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ లో జరిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.3 ఓవర్ల లో 110 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

ఓపెనర్ ఫకర్ జమాన్ 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  కుష్ దిల్ షా 17 పరుగులు, అబ్బాస్ ఆఫ్రిది 22 పరుగులు చేశారు.  మిగతా ఆటగాళ్లు ఎవరు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు.

బాంగ్లాదేశ్ బౌలర్ల లో తస్మిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు ఓవర్ లు బౌల్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.  ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు రన్ అవుట్ అయ్యారు

అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఏడు పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది.  ఓపెనర్ టాంజిద్ హాసన్, లిటన్ దాస్ చెరొక పరుగు చేసి అవుట్ అయ్యారు.

అయితే మరో ఓపెనర్ పర్వేజ్ హుసేన్ ఇమాం, తౌహీద్ హ్రిదయ్  మూడవ వికెట్ కు 73 పరుగులు జోడించారు.  36 పరుగులు చేసిన తౌహీద్ హ్రిదయ్ అవుట్ అయ్యాక, జేకర్ అలీ తో జత కలిసిన పర్వేజ్ హుసేన్ ఇమాం మరో వికెట్ పడకుండా బంగ్లాదేశ్ ను గెలిపించాడు

పర్వేజ్ హుసేన్ ఇమాం 56 పరుగులు, జేకర్ అలీ 15 పరుగులతో అజేయంగా నిలిచారు

పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా రెండు వికెట్లు, అబ్బాస్ ఆఫ్రిది ఒక వికెట్ తీశారు