టెస్ట్ క్రికెట్లో వెస్ట్ ఇండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ఎన్నో రికార్డు లు నెలకొల్పిన విషయం మనందరికీ తెలిసిందే. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు లారా మీదే ఉంది. టెస్ట్ క్రికెట్ లో 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో రికార్డు నెలకొల్పిన బ్రియాన్ లారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 500 పరుగుల రికార్డు ను కూడా నెలకొల్పాడు. అయితే 2004 లో లారా ఇంగ్లాండ్ పై చేసిన 400 పరుగుల రికార్డు ను, 21 సంవత్సరాల తరవాత బద్దలు కొట్టే అవకాశం వచ్చినా, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ముల్డర్ 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు
జింబాబ్వే తో జరుగుతోన్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ 334 బంతుల్లో 367 పరుగుల భారీ స్కోర్ చేసి అజేయంగా నిలిచాడు. ముల్డర్ ఇన్నింగ్స్ 49 ఫోర్లు, 4 సిక్సలు ఉన్నాయి. జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 626 పరుగుల వద్ద ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. బ్రియాన్ లారా రికార్డు సేఫ్
బ్రియాన్ లారా 400 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, మాధ్యు హేడెన్ 380 పరుగులు, బ్రియాన్ లారా 375 పరుగులు, మహేల జయవర్ధనే 374 పరుగుల తరవాత 367 పరుగులతో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు

