కోట శ్రీనివాసరావు. ఈ పేరు తెలియని తెలుగు సినిమా అభిమానులు ఉండరు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే అద్భుతమైన నటుడు. సీరియస్ విలనిజం లో కూడా కామెడీ ని పండించిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారు.
విలక్షణ నటనకు పెట్టింది పేరు కోట శ్రీనివాసరావు గారు. అలాంటి కోట గారికి విలక్షణ దర్శకుడు తోడైతే ఎలాంటి క్యారెక్టర్ లు పడతాయి, ఎలాంటి కామెడీ పడుతుంది అనేది మీరే ఊహించుకోండి.
అలంటి విలక్షణ దర్శకులలో ఒకరైన కామెడీ కింగ్ ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. అవేంటో ఒకసారి తలచుకుందాం.
కోట శ్రీనివాస్ రావు, ఈ వి వి సత్యనారాయణ గారి కాంబినేషన్ లో సీతారత్నంగారి అబ్బాయ్, జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, అలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆమె, అల్లుడా మజాకా, ఆయనకి ఇద్దరు, ఆవిడా మా ఆవిడే, హలో బ్రదర్, మా నాన్నకు పెళ్లి, ఆమ్మో ఒకటో తారీఖు, అబ్బాయిగారు వంటి ఎన్నో విజయవంత మైన చిత్రాలు వచ్చాయి
వీటిలో ముఖ్యంగా శ్రీకాంత్ నటించిన ఆమె చిత్రంలో పాత్రలో కోట గారి నటన అద్భుతం. పిసినారి తండ్రి గానే హాస్యాన్ని పండించడమే కాకుండా, దుర్మార్గపు ఆలోచనలతో కోడలిని చెరపట్టబోయి, భార్య చేతిలో మరణించే పాత్రలో సున్నితమైన క్రూరత్వాన్ని అద్భుతంగా పండించారు మన కోట శ్రీనివాసరావు
వెంకటేష్ నటించిన అబ్బాయిగారు చిత్రంలో సంభాషణలు ఇప్పటికి టీవీ లో చూస్తుంటాం. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వలన వచ్చిన లాభం రెండు లక్షలు లాంటి డైలాగులు చెప్పడంలో కోట గారి శైలి మరెవరికి రాదు
మా నాన్నకు పెళ్లి లో శ్రీకాంత్ తాతగా ఏందో హుందాతనం తో నిండిన పాత్ర చేసిన, జంబలకిడి పంబలో స్త్రీ తాలూకు చేష్టలు, భావాలతో నవ్వించినా ఆది కోట శ్రీనివాసరావు రావు గారికే చెల్లుతుంది
అంతే కాకుండా నాగార్జున నటించిన హలో బ్రదర్ అమాయకపు ఎస్ ఐ తాడి మట్టయ్యగా సినిమా ఆద్యంతం హాస్యాన్ని పండించిన కోట గారు చివర్లో మనల్ని కంట తడి పెట్టిస్తారు
నటనలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా విలక్షణ శైలి ఉన్న వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు. తాను అనుకున్న దానిని, నమ్మిన దానిని గట్టిగా వినిపించగలిగే వ్యక్తిత్వం కోట గారి సొంతం.
కోట శ్రీనివాసరావు గారి మృతి తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ టీవీ తన సానుభూతిని తెలియ చేస్తోంది
కోట శ్రీనివాసరావు నటించిన చివరి సినిమా ‘హరి హర వీరమల్లు’ ఈ నెల 24 న విడుదలవుతోంది.

