జీ తెలుగు కు స్టార్ మా, జెమినీ మెగా కౌంటర్

by | Apr 27, 2025 | టీవీ & ఓటిటి

ఏప్రిల్ 13 న స్టార్ మా (Star Maa) లో పుష్ప-2 ప్రీమియర్ ని ప్రసారం చేసినప్పుడు, జీ తెలుగు వారు సంక్రాంతికి వస్తున్నాం (మొదటి రిపీట్)  సినిమాతో కౌంటర్ ఇచ్చారు.  సంక్రాంతికి వస్తున్నాం ప్రభావం పుష్ప-2 (Pushpa 2) రేటింగ్ మీద ప్రభావం చూపింది. ఇండియా లోనే నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప 2 టీవీ ప్రీమియర్ రేటింగ్ ఘోరంగా వచ్చింది. అల్లు అర్జున్ కు ఘోర అవమానం ఇది

ఈ రోజు, ఏప్రిల్ 27 న జీ తెలుగు (Zee Telugu) లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీమియర్ ప్రసారం చేస్తున్నారు.  ఈ సారి స్టార్ మా ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమా ను చాలా రోజుల తరవాత ప్రైమ్ టైం లో జీ తెలుగు గేమ్ చేంజర్ కు కౌంటర్ గా ప్రసారం చేస్తున్నారు.  అంతే కాకుండా జెమినీ టీవీ వారు చిరంజీవి వాల్తేరు వీరయ్యను ప్రసారం చేస్తున్నారు

థియేటర్ లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకొని గేమ్ చేంజర్ (Game Changer) టెలివిజన్ లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి

థియేటర్ లో సూపర్ హిట్ అయ్యిన అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 రేటింగ్ టీవీ లో దారుణంగా వచ్చిన సందర్భం లో రామ్ చరణ్ (Ram Charan) ప్లాప్ సినిమా గేమ్ చేంజర్ రేటింగ్ ఇంత పోటీ మధ్య 5-6 రేటింగ్ వచ్చిన విజయం సాధించినట్లే