పాన్ ఇండియా క్రేజ్ కోసమేనా నాని తాపత్రయం; 100 కోట్ల షేర్ కొట్టేనా ఈ సారి
నాచురల్ స్టార్ నాని మంచి జోరు మీద ఉన్నారు. ఇటీవలే నాని నిర్మించిన కోర్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చి పెట్టడమే కాకుండా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతోంది. నాని మాటల్లో నిజాయితీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది.
నాచురల్ స్టార్ నాని (Nani) ఫామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. నాని అంటేనే మినిమం గ్యారంటీ అని స్థాయికి అంచెలు అంచెలుగా ఎదిగాడు. కుటుంబ కధా చిత్రాలు చేసినా, కామెడీ చిత్రాలు చేసినా, యాక్షన్ చిత్రాలు చేసినా, నాని నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
నాని గతంలో దసరా, సరిపోదా శుక్రవారం వంటి యాక్షన్ సినిమాలతో మెప్పించాడు. మధ్యలో హాయ్ నాన్న లాంటి విభిన్న సినిమా కూడా హిట్ కొట్టాడు
ప్రస్తుతం నాని రెండు సినిమాలు చేస్తున్నాడు. హిట్ 3, ది పారడైస్. ఈ రెండు భారీ యాక్షన్ చిత్రాలే. చూస్తుంటే వయోలెన్స్ ఎక్కువగా ఉండేలా ఉంది. ఈ రెండు సినిమాల మీద నాని కి చాలా నమ్మకం ఉన్నట్లుగా కనపడుతోంది
హిట్ 3 (HIT) ని ప్రపంచ స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar( అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో వయోలెన్స్ చాలా ఎక్కువగా కనపడుతోంది. దీని తరవాత 2026 మార్చ్ లో రాబోయే ది పారడైస్ (The Paradise) భారీ యాక్షన్ సినిమానే. అందులో కూడా వయోలెన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సినిమా కు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల, నాని (Nani) ది పారడైజ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఫామిలీ ఆడియన్స్ లో, చిన్న పిల్లలలో నానికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పక్కన పెట్టి వరస యాక్షన్ చిత్రాలలో చేయడానికి కారణం పాన్ ఇండియా క్రేజ్ కోసమేనా. నార్త్ లో యాక్షన్ చిత్రాలు ఎక్కువగా ఆడుతున్నాయి. కె జి ఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు భారీ స్థాయిలో విజయం సాధించాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని నాని ఇలాంటి చిత్రాలు చేస్తున్నాడా. ది పారడైజ్ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా క్రేజ్ కోసం తాపత్రయపడుతోన్న నాని ఈ ప్రయత్నంలో ఎంతవరకు విజయవంతమవుతాడో చూద్దాం. మే 1 న, హిట్-3 విడుదలవుతోంది. ఈ సినిమా కలెక్షన్స్ మీద, హిట్ రేంజ్ మీద నాని ది పారడైజ్ సినిమా బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
ఇప్పటివరకు నాని కెరీర్ లో మూడు 100 కోట్ల చిత్రాలు ఉన్నాయి. దసరా 115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే, 103 కోట్ల తో ఈగ రెండవ స్థానంలో ఉంది. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సరిపోదా శనివారం మూడవ స్థానంలో ఉంది.
ఈగ సినిమాలో నాని ఎక్కువ కనిపించడు. దసరా సినిమా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో తీసిన యాక్షన్ సినిమా అయితే సరిపోదా సినిమా కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తీసిన యాక్షన్ సినిమా.
నాని కి అర్ధమయ్యుంటుంది, యాక్షన్ సినిమాలకే కలెక్షన్స్ వస్తాయి అని. అందుకే వరసపెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. హిట్ 3, ది పారడైజ్ చిత్రాలతో, ప్రపంచ స్థాయిలో 100 కోట్ల షేర్ అందుకుంటాడా లేదో వేచి చూడాలి. ముఖ్యంగా ది పారడైజ్ సినిమాని 8 భాషలలో విడుదల చేయనున్నారు

