వివాదాలలో ఈటీవీ పాడుతా తీయగా ; మసకబారిన ఈటీవీ ప్రతిష్ట!

by | Apr 26, 2025 | టీవీ & ఓటిటి

ఈటీవీ లో ప్రసారమవుతోన్న పాడుతా తీయగా సుమారుగా 25 ఏళ్ళ నుండి ప్రసారమవుతోంది.  ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమవడమే కాకుండా గాయకులుగా రాణించారు.

కొత్తగా పాడుతా తీయగా కార్యక్రమానికి సంబంధించి ఈ వివాదాలు ఏంటి. బాలసుబ్రమణ్యం (Bala Subramanyam) , రామోజీ రావు (Ramoji Rao) గారు బ్రతికి ఉన్నంత కాలం ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగిన ఈ కార్యక్రమంపై ఇప్పుడే ఎందుకు ఇన్ని వివాదాలు

ఈటీవీ (ETV) యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులు జ్ఞాపిక ప్రొడెక్షన్స్, కీరవాణి (Keeravani), చంద్రబోస్ (Chandrabose) , సునీత (Sunitha) , ఎస్ పి చరణ్ (S P Charan) లు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై స్పందించాలి.  19 ఏళ్ళ యువ గాయని చేసిన ఆరోపణల్లో అంటే ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది.

అసలే ఈటీవీ ఛానల్ ర్యాంకింగ్ దారుణంగా ఉంది.  జబర్దస్త్, ఢీ షో లతో బండి నెట్టుకొస్తోంది 30 ఏళ్ళ వృద్ధ ఛానల్. ఈటీవీ (ETV) లో నెట్ వర్క్ 18 వారు ఇప్పటికే 49% వాటా కలిగి ఉన్నారు.  ప్రస్తుతం పాడుతా తీయగా కార్యక్రమాన్ని టీవీ లో చూడడానికి ప్రేక్షకులు కరువయ్యారు.  తక్కువ రేటింగ్ తో విలవిలలాడుతోంది ఈ కార్యక్రమం.  ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం పై గౌరవంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు

అత్యున్నత స్థానానికి ఎదిగిన ప్రతి మనిషి వెనకాల చీకటి కోణాలు ఉంటాయా.  నిజాయితీగా ఎదిగిన వాళ్ళు  ఎంత మంది

ప్రవస్తి (Pravasthi Aaradya) వ్యాఖ్యలపై స్పందించిన సునీత మాటల్లో కూడా అహంకారం కనిపించింది తప్ప ప్రవస్తి వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చినట్లుగా లేదు. కీరవాణి, చంద్రబోస్, చరణ్ లు ఇంకా ఎందుకు స్పందించలేదు

ఇంతకు ముందు. స్టార్ మా సూపర్ సింగర్ విజేత అయిన, 19 సంవత్సరాల గాయని  ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగా నిర్వాహకులపై, జడ్జి లపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వీడియో  లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.  బాడీ షేమింగ్, వేధింపులకు గురి చేయడం, జడ్జి లు అవలంబించే పక్షపాత ధోరణి గురించి సంచలన ఆరోపణలు చేసింది

ముఖ్యంగా, సింగర్ సునీత ప్రవస్తి స్టేజి మీదకు వచ్చినప్పుడల్లా అవమానకరంగా మాట్లాడడం, తన గురించి కీరవాణి తో నెగటివ్ గా మాట్లాడడం వంటి విషయాలను ప్రవస్తి లేవనెత్తింది

అంతే కాకుండా తాను ఎలిమినేట్ అయినప్పుడు, తన వంక చూసి పెళ్లిళ్లలో పాడే గాయకులంటే నాకు ఇష్టం ఉండదు అని కీరవాణి కామెంట్ చేసినట్లు గాయని ప్రవస్తి చెప్పింది 

అంతే కాక, ప్రవస్తి పాడుతా తీయగా నిర్వాహకులపైనా తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన బాడీ పై జోక్ లు వేస్తున్నారని, అంతే కాకుండా బొడ్డు చూపించేలా చీర కట్టుకోవాలని ఒత్తిడి చేసేవారని నిర్వాహకులైన జ్ఞాపిక ప్రొడక్షన్స్ పై ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి

పాటలను చివరి నిమిషంలో, అప్పటికప్పుడు వాళ్లకు అనుగుణంగా మార్చేయడం వంటి అంశాలు, తన తల్లి ని అవమానించడం, వ్యాఖ్యాత  చరణ్ గురించి తీవరమైన ఆరోపణలు చేశారు

ఎందుకు ఇప్పుడే పాడుతా తీయగా వివాదాలు.  ముఖ్యంగా సింగర్ సునీత ని సోషల్ మీడియా వేదికగా అందరు తిడుతున్నారు.  సునీత అభిమానులు మద్దతుగా నిలిచినా, మెజారిటీ శాతం సునీత కు వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు.  దర్శకుడు గీత కృష్ణ ఒక సోషల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు మాట్లాడారు.  ఎస్ పి బాలసుబ్రమణ్యం ఎంతమందినో తొక్కేసాడు అని అన్నారు.  అంతే కాక చరణ్ బలహీనతలను బయట పెట్టడమే కాకుండా జడ్జి లు గా వ్యవహరించిన వారందరిని ఉతికి ఆరేసినంత పని చేశాడు

ప్రశ్నించే గొంతు లేకపోతే అహంకారం తో చెలరేగిపోయే వాళ్ళు ఉంటారు.  యువ గాయని ప్రవస్తి ఆరాధ్య ఆరోపణల్లో వాస్తవమెంత ? ఈ విషయంపై చంద్రబోస్, కీరవాణి, సునీత, చరణ్, జ్ఞాపిక ప్రొడక్షన్స్ వారు స్పష్టమైన సమాధానం చెప్పాలి.  లేదంటే, ఈ టీవీ అనే ఛానల్ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకుంటారు జనాలు.  ఇప్పటికే బార్క్ రేటింగ్ ల ప్రకారం ఈటీవీ ఛానల్ కి అంత గొప్ప ఆదరణ లేదని తెలుస్తోంది.

గాయని ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో ఈటీవీ పతనం ప్రారంభమయిందా. ఈటీవీ (ETV) ప్రతిష్ఠ మసకబారుతోందా.  ఈ విషయాలపై  కాలమే సమాధానం చెప్పాలి