ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద షాక్. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్ గుర్క్ డక్ అవుట్ అయ్యాడు
మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్, వన్ డౌన్ లో వచ్చిన కరుణ్ నాయర్ లు రెండవ వికెట్ కు 118 పరుగులు జోడించారు. అభిషేక్ పోరెల్ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాక, కరుణ్ నాయర్ కు సహకారం అందించే ఆటగాళ్లే కరువయ్యారు
మిగతా ఆటగాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ధాటిగా ఆడిన కరుణ్ నాయర్ ఒంటరి పోరాటం చేసి 40 బంతుల్లో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
సూపర్ ఫామ్ లో ఉన్న కె ఎల్ రాహుల్ సైతం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అశుతోష్ శర్మ 17 పరుగులు, విప్రాజ్ నిగమ్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు
చివరి 75 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లను చేజార్చుకుంది. చివరకు 19 ఓవర్లలో 193 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ముంబై ఇండియన్స్ బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు తీయగా, సాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, బుమ్రా లు చెరో ఒక వికెట్ తీశారు. కరణ్ శర్మ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక ఓటమి,ముంబై ఇండియన్స్ కు మరో గెలుపు
అంతకు ముందు, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ కు రోహిత్ శర్మ, రికెల్టన్ లు మొదటి వికెట్ కు 47 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. ఎప్పటిలాగే రోహిత్ శర్మ 18 పరుగులు చేసి తొందరగా అవుట్ అయ్యాడు. ఆ తరవాత, జట్టు స్కోర్ కు మరో 28 పరుగులు జోడించిన తరవాత, 25 బంతుల్లో 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ రికెల్టన్ కూడా అవుట్ అయ్యాడు
వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఆ తరవాత వచ్చిన తిలక్ వర్మ లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 60 పరుగులు జోడించిన అనంతరం, 28 బంతుల్లో 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య రెండు పరుగులు చేసి వెంటనే అవుట్ అయ్యాడు. అయితే మరో వైపు తిలక్ వర్మ ధాటిగా ఆడుతూ ఉండగా, నమన్ ధిర్ అతనికి జత కలిశాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ ఐదవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. అయితే, 33 బంతుల్లో 59 పరుగులు చేసిన తిలక్ వర్మ 20 వ ఓవర్ నాలుగవ బంతికి అవుట్ అయ్యాడు. నమన్ ధిర్ 17 బంతుల్లో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
ముంబై ఇండియన్స్ జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది అంటే అది తిలక్ వర్మ, నమన్ ధిర్ ల చలవే
చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కులదీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ లు రెండేసి వికెట్ లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీశారు.

