టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సినీ ప్రియులు ఈ సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.
Mఇటీవల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇక ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25నుంచి మ్యాడ్ స్క్వేర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

