రెచ్చిపోయిన ఫిల్ సాల్ట్, కోహ్లీ, ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం

by | Apr 13, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు ఓపెనర్ లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరే ఆరంభాన్ని ఇచ్చారు

వీరిద్దరూ మొదటి వికెట్ కు 92 పరుగులు జోడించారు. ఫిల్ సాల్ట్ చెలరేగి పోయి ఆడాడు. కేవలం 33 బంతుల్లో, 6 సిక్సర్లు, 5 ఫోర్ల  సాయంతో  65 పరుగులు చేసి కార్తికేయ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన దేవ దత్ పడిక్కల్ తో కలిసి విరాట్ కోహ్లీ (Virat Kohli) నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ని లక్ష్యం వైపు కదిలించాడు.  విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు, దేవ దత్ పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచి, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ను గెలిపించారు

చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bangalore) , 17.3 ఓవర్ల లో ఒక వికెట్ కోల్పోయి 175 పరుగులు చేసి లక్ష్యాన్నిఛేదించింది

అంతకు ముందు, మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది

రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు సంజు శాంసన్, జైస్వాల్ లు మొదటి వికెట్ కు 49 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే సంజు శాంసన్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

ఆ తరవాత వచ్చిన రియాన్ పరాగ్ తో జైస్వాల్ రెండవ వికెట్ కు 56 పరుగులు జోడించాక, 30 పరుగులు చేసిన రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. పరాగ్ అవుట్ అయినా కాసేపటికే, 47 బంతుల్లో 75 పరుగులు చేసిన జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు

ధృవ్ జురెల్ నిలకడగా ఆడి 23 బంతుల్లో 35 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్, హేజిల్ వుడ్, క్రునాల్ పాండ్య లు  తలా ఒక వికెట్ తీశారు