తమిళనాడులోని రాజకీయాలలో వేడి అప్పుడే మొదలైంది. తాజాగా బీజేపీ, అన్నాడిఎంకె ల మధ్య పొత్తు కుదిరింది. పళనిస్వామి నాయకత్వంలో కూటమి ముందుకు వెళుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు
2026 లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పొత్తుకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారీ మెజార్టీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్తబోతున్నామని అమిత్ షా ఇప్పుడే జోస్యం చెప్పారు. ఇంకా ఏ పార్టీ ఎన్ని సీట్ల లో పోటీ చేస్తుంది అనేది తెలియాలి. 2021 లో జరిగిన ఎన్నికలలో యెన్ డి ఎ కూటమి 75 సీట్ లలో గెలిస్తే, అందులో అన్నా డిఎంకె గెలుచుకున్న సీట్ లు 66.
తమిళ నాడు లో ప్రధానంగా రెండు పార్టీ ల మధ్యే పోటీ ఉంటుంది. అది ఒకటి ఎం జి రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే అయితే రెండవది అన్నాదురై స్థాపించిన డీఎంకే. ప్రస్తుతం అన్నాడీఎంకే కి పళనిస్వామి అధ్యక్షుడుగా ఉండగా, డీఎంకే కు ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షుడుగా ఉన్నారు
2026 లో తమిళనాడు లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రం మారిపోతుంది.
ఎందుకంటె 2026 లో స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ ‘ తమిళగ వెట్రి ఖజగం’ 2026 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ముక్కోణపు పోటీ అవుతుంది.
విజయ్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావచ్చు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో తరతరాలుగా ప్రజలు విసుగు చెందితే విజయ్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే రెండు ఏళ్లలో యువత ఓటు హక్కు ని రిజిస్టర్ చేయగలిగేలా చేస్తే విజయ్ పార్టీ కి ప్లస్ అవుతుంది. విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోయినా, ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఈ ఓట్ల చీలికలో ఎక్కువగా లాభపడేది మాత్రం డీఎంకే పార్టీ. ఎందుకంటె నాన్ బీజేపీ ఓట్లతో విజయ్ పార్టీ అన్నాడీఎంకే ఓట్లను చీల్చే అవకాశముంది. సరిగ్గా చిరంజీవి స్థాపించిన ప్రజాపార్టీ వల్లే టీడీపీ కి దెబ్బ పడింది. ఆ ఎన్నికలలో మెజారిటీ తగ్గినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితి. బీజేపీ స్ట్రాటజీ లో భాగంగా, ఎన్నికలముందు బీజేపీ భారీ తాయిలాలు తమిళనాడు కు ప్రకటించవచ్చు
అయితే పార్టీ స్థాపించారు కానీ విజయ్ స్టాండ్, అజెండా అవి పూర్తి గా ప్రజలకు తెలియాలి. విజయ్ పట్ల యువత లో క్రేజ్ ఉన్న మధ్య వయసు వాలు, సీనియర్ సిటిజన్స్ విజయ్ ని అంగీకరిస్తారా లేదా అనేది వెయ్యి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇవన్నీ తెలియన్లంటే ఇంకా చాలా టైం ఉంది. అందునా రాజకీయ వ్యూహకర్త ప్రస్థానం కిశోర్, విజయ్ పార్టీ తో జత కలిశాడు. చూద్దాం ఏం జరుగుతుందో
అయితే బీజేపీ, అన్నాడిఎంకె ల పొత్తు తో తమిళ్ నాడు రాజకీయాలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి బీజేపీ దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో లేదు. బీజేపీ కి అంతుపట్టని పదార్ధం ఏమైనా ఉంటె అది సౌత్ రాజకీయాలే

