తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సునీల్, ప్రసన్న, యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో విడుదల చేశారు. దింతో బాక్సఫీస్ వద్ద మొదటి రోజు వసూళ్లు కూడా భారీగానే దక్కాయి.
ఈ చిత్రానికి మొదటి రోజు ఇండియాలో రూ. 29.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా.. ఇందులో తమిళంలో రూ.28.15 కోట్లు, నతెలుగులో రూ.1.1 కోట్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తొలి రోజు ఇండియా వైడ్ రూ. 34.40 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ఒక్క తమిళ్ లోనే రూ.30.4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మొదటి రోజునే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా రూ.51.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. ఇక రెండో రోజు ఇండియాలో రూ.13.50 కోట్ల నెట్ వసూళ్లు, అలాగే రూ.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ వీకెండ్‌లో ఈ సినిమా ఎలా పుంజుకుంటుంది అనేది చూడాలి. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రాన్ని రూ. 280 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా… ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా బాక్సఫీస్ వద్ద రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది.

