ఈ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కి చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ కు సిద్ధం అయ్యింది. ఇంతలో ఢిల్లీ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. అసలే ఢిల్లీ లో గాలి కాలుష్యం. గాలి దుమారం లాగా దుమ్ము దుమారం. దుమ్ము బాగా గాల్లోకి లేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళను వచ్చేయమని రోహిత్ అరవడం రికార్డు అయ్యింది. నన్ను ఎందుకు రికార్డు చేస్తున్నావ్ అటు వైఫుర్ రికార్డు చెయ్ అన్నాడు రోహిత్ శర్మ.
వరస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ముంబై ఇండియన్స్, మరో పక్క వరస విజయాలతో దూసుకు పోతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది.

