చైనా లో ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన

by | Apr 12, 2025 | వార్తలు

చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.  చైనాలోని హువాజియాంగ్ గ్రాండ్ కేనియన్ వంతెన ఈ సంవత్సరం ప్రారంభం కానుంది, ఇది 2050 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా నిలిచింది.

వంతెన యొక్క ఇటీవలి ఫుటేజ్ విడుదలైంది, సిబ్బంది తుది మెరుగులు దిద్దుతున్నట్లు చూపిస్తుంది.

2022 లో  ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. 2025 లో ఓపెన్ అవుతుంది. అంటే కేవలం మూడు సంవత్సరాలలో దీనిని నిర్మించారు. ఈ వంతెన దాదాపు ఒక మైలు పొడవు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెన కంటే తొమ్మిది రెట్లు ఎత్తులో ఉంది.

ఈ వంతెన డ్రైవర్ల ప్రయాణ సమయాన్ని గంట నుండి నిమిషానికి తగ్గిస్తుంది.  దీని ధర దాదాపు $280 మిలియన్లు.  అంటే మన భారత దేశ కరెన్సీ ప్రకారం 2400 కోట్లు

ప్రస్తుతం సోషల్ మీడియా లో దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2025 జూన్ లో ఈ వంతెనని ప్రారంభించనున్నారు భారీ నిర్మాణాలకు చైనా పెట్టింది పేరు.  ప్రపంచంలో ఎత్తయిన 100 వంతెనల్లో 50 చైనా లోనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు.