టాలీవుడ్ యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ (NTR( ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోటుంది చిత్రయూనిట్.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం (ఏప్రిల్ 12న) సాయంత్రం 6నుంచి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ (NTR) వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన అన్న కళ్యాణ్ రామ్ (Kalyan Ram( సినిమా గురించి ఆయన ఏం మాట్లాడుతారో అన్నది చూడాలి. శనివారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు వేదికకు చేరుకోవచ్చని తెలుస్తోంది. కొన్నేళ్లుగా అభిమానుల్ని కలవని ఎన్టీఆర్ ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మళ్ళీ వారం వ్యవదిలోనే మరోసారి ఆయన అభిమానుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

