మరో హుషారైన గీతంలో మిల్క్ బ్యూటీ తమన్నా

by | Apr 11, 2025 | సినిమా

పనోరమా స్టూడియో ప్రౌడక్షన్ వారు నిర్మిస్తోన్న చిత్ర రైడ్ 2.  అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కధానాయకుడు.  దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్, వాణి కపూర్ తదితరులు నటించారు

ఈ చిత్రంలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.  నషా నషా అంటూ సాగే ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు.  ఈ పాటలో తమన్నా తన స్టెప్ లతో కుర్రకారును ఒక ఊపు ఊపుతోంది

2018 లో విడుదలై సూపర్ హిట్ అయిన రైడ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ఈ రైడ్ 2 ని మే 1 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు  ఈ చిత్ర ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.