ఆస్కార్‌లో కొత్త అవార్డు.. రామ్‌చరణ్‌ స్టంట్ ఫొటోతో!

by | Apr 11, 2025 | సినిమా

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల్లో సరికొత్త కేటగిరీ చేరనుంది. ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్తగా వార్షిక అవార్డుగా ఇక నుంచి స్టంట్ డిజైన్ క్యాటగిరీని చేర్చినట్లు తాజాగా ఆస్కార్ అకాడమీ వెల్లడించింది. దీంతో ఆస్కార్‌ అవార్డుల విభాగాల సంఖ్య మరింత పెరగనుంది. కానీ వచ్చే ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఈ అవార్డును ప్రదానం చేయరు. 2028లో జరిగే 100వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో (Oscar Awards) ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. అంటే.. 2027లో రిలీజయ్యే సినిమాలకు స్టంట్ డిజైన్ క్యాటగిరీలో 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌ కోసం నామినేట్‌ అవుతారు. అయితే ఈ అవార్డ్ అనౌన్స్మెంట్ లో హాలీవుడ్ సినిమాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ అలాగే టామ్ క్రూయిస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టంట్స్ పోస్టర్స్ తో పాటు రాజమౌళి (Rajamouli) ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ పోస్టర్ ని కూడా ఇందులో మిక్స్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘ఫిల్మ్‌ మేకింగ్‌ విభాగంలో, ఆస్కార్‌ ప్రదానోత్సవంలో స్టంట్ డిజైన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వారిని ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగం చేయడం గర్వంగా ఉంది’ అని ఈ సందర్భంగా ఆస్కార్‌ అకాడమీ పేర్కొంది. ఇదిలాఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌,(NTR) రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవేదికపై తెలుగు సినిమా సత్తాను చాటిన సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ను గెలుపొంది అదరగొట్టింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు.