ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఓపెనర్ లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ లు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు.
ఇక్కడినుంచే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వికెట్ల పతనం ప్రారంభమయింది . ఫిల్ సాల్ట్ రన్ అవుట్ అయిన తరవాత వచ్చిన, పడిక్కల్ ఒక్క పరుగు చేసి వెంటనే అవుట్ అయ్యాడు. మరి కొద్ది సేపటికే మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
కెప్టెన్ రజత్ పటిదార్ కాసేపు నిలబడి 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే లివింగ్ స్టోన్, జితేష్ శర్మ లు ఇలా వచ్చి అలా వెళ్లారు
18 పరుగులు చేసిన క్రునాల్ పాండ్య, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్ లు ఎనిమిదవ వికెట్ కు 38 పరుగులు జోడించారు. మొదటి వికెట్ తరవాత రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం
టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 38 పరుగుల ఈ భాగస్వామ్యంలో భువనేశ్వర్ కుమార్ చేసింది ఒకే ఒక్క పరుగు.
60 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరవాతి 65 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది
చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ లు చెరో ఒక వికెట్ తీశారు

