Peddi OTT: రామ్‌చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓటీటీ డీల్‌

by | Apr 10, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. శ్రీరామిన‌వ‌మి కానుక‌గా ‘పెద్ది’ నుంచి ఫ‌స్ట్ షాట్‌ గ్లింప్స్ విడుదల చేయగా.. ఇప్పటికే ఈ గ్లింప్స్ కు తిరుగులేని రెస్పాన్స్‌ వచ్చింది. రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ కు ‘గేమ్ ఛేంజర్’ చేసిన గాయానికి అసలు సిసలైన మందు ‘పెద్ది’ అని ఫిక్సయిపోయారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ లెక్కలు ఆసక్తిగా మారాయి. ‘పెద్ది’ (Peddi) మూవీ నాన్ థియేట్రికల్ రైట్ దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా దిగ్గజ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) , నెట్​ఫ్లిక్స్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలకు కళ్లు చెదిరే రేటును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం​ నెట్​ఫ్లిక్స్​ (Netflix) భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓటీటీ డీల్‌గా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దింతో త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది. కేవలం నాన్‌ థియేట్రికల్‌ హక్కులకే ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరుగుతుందంటే థియేట్రికల్‌ బిజినెస్‌ ఇంకెంత స్థాయిలో జరుగుతుందోనని అప్పుడే ఫ్యాన్స్‌ లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, పెద్ది మూవీ మ్యూజికల్ రైట్స్ టీ సిరీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. పెద్ది మూవీ ఆడియో రైట్స్ డీల్ రూ.25 కోట్లకు క్లోజ్ ఆయునట్లు సమాచారం. కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.