ఎన్టీఆర్ – నీల్ మూవీ.. ఓవర్సీస్​ రైట్స్​ ఎన్ని కోట్లంటే?

by | Apr 10, 2025 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో హీరో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి పాల్గొననున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో రిలీజ్‌కు ముందే ఈ మూవీ సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. దింతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే మొదలైంది. తాజాగా ఈ మూవీ యూఎస్ హక్కులను ‘సలార్’, ‘కల్కి 2898 ఏడి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసిన సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యూఎస్ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా యూఎస్ రైట్స్ కోసం పలు కంపెనీలు పోటీపడ్డాయంటే సినిమాపై ఎలాంటి క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతకుముందు ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ చిత్రం దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. యూఎస్ లో రూ.27కోట్లకు అమ్ముడయింది. దేవర తర్వాత దాదాపు దానికి రెండింతల ధరకు ఎన్టీఆర్, నీల్ మూవీ రైట్స్ అమ్ముడవడం విశేషం. ఇదిలాఉంటే.. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారు. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంక షెడ్యూల్​లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ​(NTR) పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.