ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే.
సమ్మర్ క్యాంపు లో జరిగిన అగ్నిప్రమాదం లో, మార్క్ శంకర్ కళ్ళకు, చేతులకు గాయాలు అయినాయి. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు
పెద్ద కుమారుడు అకిరా పుట్టిన రోజు (ఏప్రిల్ 8) నాడే ఇలా జరగడం బాధాకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ని చూడడానికి, చిరు దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు
అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారని, ఇంటికి వచ్చేసాడని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన విషయం మీకు యథాతధంగా అందిస్తున్నాం.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు పవన్ కల్యాణ్ తరపున, మా కుటుంబం యావన్మంది తరపున అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.


