ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు డు ప్లెసిస్ 2 పరుగులు, జేక్ ఫ్రేజర్ మెగ్ గుర్క్ 7 పరుగులు చేసి అవుట్ అవగా, వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ పోరెల్ కూడా 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
కాసేపటికి, 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా అవుట్ అవడంతో, 58 పరుగుల కే నాలుగు వికెట్లు కోల్పోయి న ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అంచున నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి ఖాయం అనిపించింది. అయితే కె ఎల్ రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించింది
కె ఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ లు ఐదవ వికెట్ కు అజేయంగా 111 పరుగులు జోడించారు. కె ఎల్ రాహుల్ 53 బంతుల్లో, 6 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 93 పరుగులు , ట్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు
ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది
వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా, యష్ దయాల్, సుయశ్ శర్మ లు చెరో ఒక వికెట్ తీశారు.
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ తో సమానంగా ఉంది. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న గురజాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఐపీల్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది
అంతకు ముందు, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఓపెనర్ లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ లు మొదటి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు.
ఇక్కడినుంచే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వికెట్ల పతనం ప్రారంభమయింది . ఫిల్ సాల్ట్ రన్ అవుట్ అయిన తరవాత వచ్చిన, పడిక్కల్ ఒక్క పరుగు చేసి వెంటనే అవుట్ అయ్యాడు. మరి కొద్ది సేపటికే మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
కెప్టెన్ రజత్ పటిదార్ కాసేపు నిలబడి 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే లివింగ్ స్టోన్, జితేష్ శర్మ లు ఇలా వచ్చి అలా వెళ్లారు
18 పరుగులు చేసిన క్రునాల్ పాండ్య, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్ లు ఎనిమిదవ వికెట్ కు 38 పరుగులు జోడించారు. మొదటి వికెట్ తరవాత రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం
టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 38 పరుగుల ఈ భాగస్వామ్యంలో భువనేశ్వర్ కుమార్ చేసింది ఒకే ఒక్క పరుగు.
60 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరవాతి 65 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది
చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ లు చెరో ఒక వికెట్ తీశారు

