బొమ్మరిల్లు భాస్కర్, జొన్నలగడ్డ సిద్దు – వాట్ ఎ కాంబినేషన్ ?

by | Apr 10, 2025 | ప్రగడ టీవీ

బొమ్మరిల్లు భాస్కర్, మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు భాస్కర్. ఆ తరవాత 5 సినిమాలు చేసిన భాస్కర్ కు బొమ్మరిల్లు రేంజ్ హిట్ రాలేదు

బొమ్మరిల్లు తరవాత అల్లు అర్జున్ తో పరుగు, రామ్ చరణ్ తో న్యూ ఏజ్ స్టోరీ ఆరంజ్ సినిమాలు తీశాడు.  ఆరెంజ్ తరవాత మూడేళ్లకు ఒంగోలు గిత్త, ఆ తరవాత ఎనిమిదేళ్ళకు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ తీశాడు

వీటిలో రామ్ చరణ్ ఆరెంజ్ కు క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందినా కమర్షియల్ గా సినిమా ప్లాప్.  ఒంగోలు గిత్త ఉత్తర్ ప్లాప్.  పరుగు, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలు పరవాలేదనిపించాయి

ఓవరాల్ గా 18-19 సంవత్సరాలలో బొమ్మరిల్లు భాస్కర్ చేసింది 5 చిత్రాలు.  వీటిలో ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినవే ఎందుకంటె భాస్కర్ కు బాగా పేరు తెచ్చిన చిత్ర బొమ్మరిల్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసినదే. 

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ తరవాత నాలుగేళ్లకు జొన్నలగడ్డ సిద్ధూ తో జాక్ సినిమా తీశాడు

జొన్నలగడ్డ సిద్దు 2009 నుండి చిన్న వేషాలు వేసుకుంటూ వస్తోన్న సిద్దు 2016 లో గుంటూరు టాకీస్ సినిమాతో కొన్ని వర్గాల ప్రేక్షకులకు తెలిసింది.

అయితే జొన్నలగడ్డ సిద్దు అంటే డి జె టిల్లు అనేంత పేరు వచ్చింది మాత్రం డి జె టిల్లు తో మాత్రమే.

ఒక క్విర్కీ క్యారెక్టర్ ని రాసుకుని తానే హీరో గా నటించి హిట్ కొట్టాడు. ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంది ఈ సినిమా.. డి జె టిల్లు ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన రెండవ చిత్రం టిల్లు స్క్వేర్.  ఈ సినిమా కూడా సూపర్ హిట్.

మొత్తంగా 16 ఏళ్ళ జొన్నలగడ్డ సిద్దు కెరీర్ లో డి జె టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలే చెప్పుకోదగినవి, సూపర్ హిట్ అయినవి. ఈ రెండు కూడా యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమాలు

ఇలా రెండు భిన్న ధ్రువాలైన బొమ్మరిల్లు భాస్కర్, జొన్నలగడ్డ సిద్దు కాంబినేషన్ లో వచ్చిన జాక్ సినిమా చూస్తే ఆది భాస్కర్ సినిమానా లేదా జొన్నలగడ్డ సిద్దు సినిమానా అన్న అనుమానం కలుగుతుంది.  కుటుంబ ప్రేక్షకులను లక్ష్యం గా సినిమాలు తీసే దర్శకుడు, యువతను లక్ష్యంగా సినిమాల్లో నటించే సిద్దు అలియాస్ టిల్లు – వీరిద్దరి కలయిక ఊహించలేనిది

వీళ్లిద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లుగా ఇటీవల సిద్దు కూడా చెప్పాడు. వీళ్లిద్దరి ఆలోచనలలో తేడా ఉంది అని సినిమా చూసిన వాళ్లకు తెలుస్తుంది.

ఇలాంటి రా ఏజెంట్ సినిమా ఏంటి, దీనిలో మధ్యలో మదర్ సెంటిమెంట్ ఏంటి, సీరియస్ ఫన్నీ మిషన్ ఏంటి ….. ట్రైలర్ లో వాడిన బూతులు చూస్తే ఫామిలీ ఆడియన్స్ చూస్తారా ఈ సినిమాని.  బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ లో ఇంత బోరింగ్ సినిమా ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు