రవితేజ ‘మాస్‌ జాతర’ – ‘తూ మేర లవర్’ అంటూ ఫ‌స్ట్ సింగిల్

by | Apr 10, 2025 | సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌‌లైన్‌‌. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నరన్న సంగతి తెలిసిందే. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ హీరోగా గ‌తేడాది వ‌చ్చిన ఈగ‌ల్, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ చిత్రాలు బాక్సఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో ప్ర‌స్తుతం ర‌వితేజ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. రవితేజకు జోడిగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది. ఇదివ‌ర‌కే ఈ సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు అభిమానుల్ని ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

ఈ చిత్రంలోని ‘తూ మేర లవర్..’ అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ‌ అమ్మాయిలతో ఆడిపాడుతున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ సూపర్ హిట్ ఇడియట్ మూవీలో చూపుల‌తో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రవితేజ, రాజేంద్రప్రసాద్‌ తాతామనవళ్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. మాస్ జాతర చిత్రాన్ని సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.