పెద్ది కి టికెట్ అమ్మిన ప్రదీప్ ; సత్య ని షూట్ కి రమ్మన్న చరణ్

by | Apr 10, 2025 | సినిమా

యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రొమోషన్స్ ఫన్నీ గా ఉన్నాయి. ప్రదీప్ మాచిరాజు, కమెడియన్ సత్య లు వెళ్లి రామ్ చరణ్ కు మొదటి షో మొదటి టికెట్ ను అమ్మారు.  ఈ టికెట్ అమ్మే ప్రక్రియని చాలా ఫన్నీ గా చేశారు. చివర్లో కమెడియన్ సత్య ని టైం కి షూట్ కి రమ్మన్నారు రామ్ చరణ్…… వీడియో ఆసాంతం నవ్వులు పూయిస్తోంది

ఏప్రిల్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ఈ అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది

మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రచయిత సందీప్ బొల్లా, రాధాన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించింది నితిన్-భరత్ ల ద్వయం.