సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ 2’ (War) సినిమా కూడా ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న ఒకే రోజున రజినీకాంత్ ‘కూలీ’ (Coolie) , ఎన్టీఆర్ ‘వార్ 2’ వంటి రెండు పెద్ద సినిమాలు విడుదల కానుండడంతో బాక్సఫీస్ వద్ద పోరు హోరాహోరీగా ఉండనుంది.
అయితే రజినీకాంత్ – ఎన్టీఆర్ (Rajanikanth and NTR) మధ్య బాక్సఫీస్ పోటీ ఈ కాకుండా వచ్చే ఏడాది కూడా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు జైలర్ 2 చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ సెట్స్ లో రజినీకాంత్ ఏప్రిల్ మూడో వారంలో చేరనున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగెన్ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ఈ షూటింగ్లో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి మొదలుకానున్న షెడ్యూల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నన్నాడు. ఇలా ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్న రజినీకాంత్ ‘జైలర్ 2’, ఎన్టీఆర్ ‘డ్రాగెన్’ (Dragon) రెండు చిత్రాలు కూడా 2026 ఏప్రిల్‌లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవదిలోనే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయని తెలుస్తోంది. దింతో ఈ ఏడాదే కాకుండా వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్, ఎన్టీఆర్ మధ్య బిగ్ ఫైట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బాక్సఫీస్ పోరులో ఎవరు గెలుస్తారన్నది చూడాలి.

