టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణతో పాటుగా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఈ మూవీ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో అనిరుధ్ రవిచంద్రన్ ఇంకా చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇప్పటికే అంగీకరించిన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో త్వరలోనే ‘కింగ్డమ్’ మ్యూజిక్ పనుల్లో అతను చేరతాడాని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటనకు అనిరుధ్ సంగీతం తోడైతే ఈ సినిమాకు తిరుగుండదని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కాగా, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అణచివేతకు గురైన తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి శ్రీలంక సైన్యాన్ని ఎదురించే తిరుగుబాటు నాయకుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ‘కింగ్డమ్’ (Kingdom) సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రానికి జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

