‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’-కళ్యాణ్ రామ్ కోసం బరిలోకి ఎన్టీఆర్

by | Apr 10, 2025 | సినిమా

లీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోటుంది చిత్ర‌యూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 12న హైద్రాబాద్ లో భారీ ఎత్తున్న మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా.. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు ఎన్టీఆర్, (NTR) రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. తార‌క్ అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డంతో ఈ సినిమాను స‌పోర్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా ఈ వార్త‌పై ఇప్పటికే కళ్యాణ్ రామ్ అధికారికి ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు అన్నీ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాకు ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్‌ ఇస్తారో చూడాలి. కాగా, ఈ చిత్రానికి అజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.