బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జాట్’. ఈ సినిమాతో సన్నీడియోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా.. విలన్ పాత్రలలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ నటించారు. రెజీనా కసండ్రా కీలక పాత్రలో నటించింది. ఇందులోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్టెప్పులేసింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.
2023లో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా తర్వాత ‘జాట్’ను టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుండగా.. తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో ఒకేసారి విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నించినా డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో తెలుగు వర్షన్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం జాట్ (Jaat) మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17న విడుదల కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

