మినిస్ట్రీ అఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన భారత దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతూ వస్తోంది. అంతే కాకుండా వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.
1951 లో 36.10 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో జనాభా వృద్ధి రేటు 1.25% గా ఉంది. అయితే 1971 లో అంటే 20 సంవత్సరాలకు జనాభా 54.81 కోట్ల కు చేరుకుంది. వృద్ధి రేట్ 2.22% గా ఉంది. గత 75 ఏళ్లలో భారత దేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు 2.22%
2011 లో జనాభా లెక్కలు కట్టారు. ఆ తరవాత మళ్ళీ జనాభా ను లెక్కకట్టలేదు. 2021 లో సెన్సస్ చేపట్టాలి అయితే కరోనా కారణంగా సెన్సస్ చేపట్టలేదు.
అయితే మినిస్ట్రీ అఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2036 కు మన భారత దేశ జనాభా 152 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అయితే వృద్ధి రేట్ మాత్రం 0.58% గా అంచనా కట్టారు. దీని ఫలితంగా జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటిదాకా దేశ జనాభా లో పిల్లలు, యువత శాతం ఎక్కువగా ఉండేది. అయితే ముందు ముందు పిల్లల, యువత శాతం తగ్గిపోయి, మధ్య వయసు వారు, వృద్ధుల శాంతం పెరిగే అవకాశం ఉంది
19 సంవత్సరాలలోపు గల పురుషులు 2011 లో సుమారు 41% ఉంటె 2036 కు సుమారు 27% పడిపోతుందని అంచనా వేశారు.
19 సంవత్సరాలలోపు గల ఆడపిల్లలు 2011 లో సుమారు 40% ఉంటె 2036 కు సుమారు 26% పడిపోతుందని అంచనా వేశారు
అంటే ఆధారపడి వారి సంఖ్య పెరుగుతుంది. ఇది ఎంత మాత్రం దేశాభివృద్ధికి మంచిది కాదు. అందుకే కొన్ని రాష్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పిల్లల్ని కనమంటున్నాయి. ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు అన్న ప్రభుత్వాలు ఇప్పుడు పిల్లల్ని కనమంటున్నాయి
దేశ జనాభాలో మహిళల శాతం పెరుగుతుందని అంచనా వేసింది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 48.5% మహిళలు ఉండగా, 2036 నాటికి కొంత మేర పెరిగి 48.8% కి చేరుకుంటుంది. ఆ మేరకు పురుషుల జనాభా శాతం తగ్గనుంది
సోర్స్ : రిజిస్ట్రార్ జనరల్ అఫ్ ఇండియా కార్యాలయం టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ రిపోర్ట్

