టాలీవుడ్ లో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను అలరించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టైటిల్లో పెట్టినట్లుగానే జాక్ కొంచెం క్రాక్ అనిపించేలా కొన్ని బూతులతో ట్రైలర్ రూపొందించారు. జాక్ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ జాక్ అనే ప్రయివేట్ స్పై ఏజెంట్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ‘జాక్’ (Jack) సినిమా చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ‘జాక్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే జాక్ మూవీ ట్రైలర్‌లో కొన్ని బూతులు ఉండడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు వస్తాయని అనుకున్నారు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ మూవీ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక జాక్ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే.. కేవలం 2 గంటల 30 నిమిషాల సాలిడ్ రన్ టైం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటుగా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, జాక్ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.

