‘గ్రౌండ్ జీరో’ అనే ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే కధ. ధైర్యం, త్యాగం వంటి అంశాల మేళవింపుతో సాగిన నిజమైన కధ. 2015లో గత 50 ఏళ్లలో BSF యొక్క ఉత్తమ ఆపరేషన్‌గా అవార్డు పొందిన ఒక మిషన్ నుండి ప్రేరణ పొందిన కథ ఈ చిత్రం
ఇమ్రాన్ హష్మీ ఈ ‘గ్రౌండ్ జీరో’ లో ఉగ్రవాద సూత్రధారిని పట్టుకునే పట్టుదలగల సరిహద్దు భద్రతా దళం (BSF) కమాండర్ గా నటించాడు. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2001 భారత పార్లమెంటు దాడి తర్వాత కాశ్మీర్లో సెట్ చేయబడింది.
ఇప్పటివరకు ఎవరికి తెలియని, ఎవరు చెప్పని కధ. ఇండియా లోని మోస్ట్ డేంజరస్ మిషన్ వెనకాల జరిగిన కధ. ఏప్రిల్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఎక్సెల్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు తేజస్ ప్రభా విజయ్ దేవోస్కర్. ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ ను నిర్మాతలు.

