ఇంకా 9 నెలలు ఉన్న 2026 సంవత్సరానికి స్టార్ హీరోలు పోటాపోటీగా ఇప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననా యగన్ 2026 లో జనవరి 9 డేట్ ని లాక్ చేసుకోగా, ఆదే రోజున ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు చిరంజీవి, అనిల్ రావిపూడి ల సినిమా కూడా 2026 సంక్రాంతికే వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు
కె జి ఎఫ్ తో బాలీవుడ్ ని షాక్ చేసిన నటుడు యాష్ తన టాక్సిక్ సినిమాని మార్చ్ 19 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించాడు. నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ చిత్రం ది పారడైస్. ఈ చిత్రాన్ని మార్చ్ 26 న విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా ఫస్ట్ షాట్ ని ఈ రోజు విడుదల చేశారు వృద్ధి సినిమా వారు. ఈ ఫస్ట్ షాట్ చివరలో మార్చ్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

