శ్రీ రామ చంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో జన్మించారు. అభిజిత్ ముహూర్తంలో జన్మించారు అని పురాణాలూ చెపుతున్నాయి. శ్రీ రాముడి వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది
శాస్త్రాల ప్రకారం అవతార పురుషులు జన్మించిన తిథినాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది నియమంగా ఉంది. అందుకే శ్రీ రామ నవమి నాడు, అంటే రాముడు పుట్టినరోజు నాడు, సీత రాముల కళ్యాణం చేస్తారు
అంతే కాకుండా సీత సమేతుడైన శ్రీరాముని పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలూ చెపుతున్నాయి.
శ్రీరామ నవమి నాడు వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి. సాయంత్రం రామాయలానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలి. అంతే కాకుండా పందిళ్ళలో సీత రామ కల్యాణాన్ని చూడాలి, ఆ రామ నామాన్ని జపించుకోవాలి
వశిష్ట మహాముని శ్రీరాముడు కు ఆ పేరు పెట్టారు. ఆ పేరుకు అర్ధం ఏంటో తెలుసా. రామ అంటే రమయతి గుణై ; ప్రజా యితి రామ అని. అంటే ఆనందించునది, ఆహ్లాదం పంచునది అని అర్ధం. వేదాల ప్రకారం సమస్త ప్రపంచానికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆధారం. రామ శబ్దంలో ‘ర’ అంటే అగ్ని ‘అ’ అంటే సూర్యుడు ‘మ’ అంటే చంద్రుడు. అగ్ని వలన పాపం, సూర్యుడి వలన అజ్ఞానం, చంద్రుడి వలన తాపం తగ్గుతాయని నమ్మకం
అంతే కాకుండా శ్రీ రాముడిని ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా లక్ష్యాన్ని సాధించాలనే దానికి ప్రతీకగా, సీత మాత ను సహనానికి ప్రతీకగా చెపుతారు. ఈ రెండు లక్షణాలు అలవర్చుకున్న మనిషి నిజంగా ధన్య జీవి.


