ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్ల లో 6 వికెట్లు నష్టానికి 183 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్ గుర్క్ డక్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ పోరెల్ తో కలిసి మరో ఓపెనర్ కె ఎల్ రాహుల్ రెండవ వికెట్ కు 54 పరుగులు జోడించారు
33 పరుగులు చేసి అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యిన తరవాత కెప్టెన్ అక్షర్ పటేల్ తో కలిసి కె ఎల్ రాహుల్ మూడవ వికెట్ కు 36 పరుగులు జోడించిన తరవాత అక్షర్ పటేల్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన సమీర్ రిజ్వి, కె ఎల్ రాహుల్ లు నాలుగవ వికెట్ కు 56 పరుగులు జోడించాక సమీర్ రిజ్వి అవుట్ అయ్యాడు. ఆ తరవాత 51 బంతుల్లో 77 పరుగులు చేసిన కె ఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. చివర్లో స్టబ్స్ ధాటిగా ఆడి 12 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్, జడేజా, పతిరానా లు తలా ఒక వికెట్ తీశారు
Fall of wickets: 1-0 (Jake Fraser-McGurk, 0.5 ov), 2-54 (Abishek Porel, 6.5 ov), 3-90 (Axar Patel, 10.4 ov), 4-146 (Sameer Rizvi, 16.1 ov), 5-179 (KL Rahul, 19.2 ov), 6-180 (Ashutosh Sharma, 19.3 ov)

