తెలుగు చిత్రసీమలో భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్ తదుపరి సినిమా మీదే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అఖిల్ (Akhil) ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ ఓ గ్రాండ్ ట్రీట్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం ఈ ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీనిపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ అధికారిక ప్రకటన కూడా అందించారు. ఏప్రిల్ 8న ‘అఖిల్ 6’ మూవీ క్రేజీ అప్డేట్ వస్తుంది అని ప్రకటించారు. దింతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అధికభాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్ చేస్తారట. భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

