హోమ్ టౌన్ వెబ్ సిరీస్ | ప్లాట్ ఫామ్ : ఆహా
నటి నటులు : రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాదవ్, యాని, సాయిరాం , అనిరుద్ భాస్కర్
దర్శకత్వం : శ్రీకాంత్ రెడ్డి పల్లె
ఈ హోమ్ టౌన్ సిరీస్ లో 5 ఎపిసోడ్ లు మాత్రమే ఉన్నాయి
ఈటీవీ విన్ లో 90s మిడిల్ క్లాస్ బయో పిక్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. నవీన్ మేడారం ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు
మధ్య తరగతి కుటుంబాల జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా తీసిన 90s మిడిల్ క్లాస్ బయో పిక్ ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికి తెలుసు
నవీన్ మేడారం నిర్మాతగా మరొక వెబ్ సిరీస్ హోమ్ టౌన్ ను ఆహ వేదికగా ఏప్రిల్ 4 న రిలీజ్ చేశారు. ఈ హోమ్ టౌన్ వెబ్ సిరీస్ కూడా మధ్య తరగతి ప్రజల జీవితాలను ప్రతిబింబించేలా రూపొందించారు
ఈ హోమ్ టౌన్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం
తెలంగాణ లోని హనుమంతులగూడెం అనే పల్లెటూరు లో ప్రసాద్ (రాజీవ్ కనకాల) అనే వ్యక్తి కధ. తన కూతురు పేరు మీద ఫోటో స్టూడియో పెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. స్టూడియో మీద నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఐదు వేల రూపాయలతోనే కుటుంబాన్ని వెళ్లదీసుకుంటూ వస్తాడు
మా నాన్న దగ్గర డబ్బు లేక నేను చదువుకోలేకపోయా. నా కొడుకుకు అలంటి పరిస్థితి రాకూడదు అని ఎంత ఖర్చైనా కొడుకుని విదేశాలకు పంపాలని, కూతురికి మంచి సంబంధం తీసుకు వచ్చి పెళ్లి చేయాలనీ అనుకుంటాడు
ఆందుకోసం పాలసీ లు కూడా కడతాడు. తన మార్కులు తానే దొంగగా వేసుకునే కొడుకు తండ్రి కళను నెరవేరుస్తాడా, కూరి పెళ్లి ఘనంగా ప్రసాద్ చేయగలుగుతాడు అనేది మిగతా కధ
90s మిడిల్ క్లాస్ బయోపిక్ కు ఒక 10 సంవత్సరాల తరవాత 2000 మిడిల్ క్లాస్ బయోపిక్ ఈ హోమ్ టౌన్ సిరీస్
పిల్లలు వాళ్ళ మార్కులు వల్లే వేసుకోవడం, క్రికెట్ కిట్ కొనడానికి వాళ్ళు పడే పాట్లు, స్వాతి వార పత్రిక కొని చదవడం వంటి అంశాలతో మొదటి రెండు ఎపిసోడ్ లు కాలక్షేపం చేశాడు దర్శకుడు
ఆ తరవాత ఎపిసోడ్ లలో, కాలేజీ రోజుల్లో ఉండే లవ్, అప్పుడప్పుడే వస్తోన్న సోషల్ మీడియా ముఖ్యంగా పేస్ బుక్ కు సంబందించిన కొన్ని సన్నివేశాలు పరవాలేదనిపించాయి. సోషల్ మీడియా లో జరిగే కొన్ని కొన్ని మోసాలను కూడా చూపించారు
ఈ హోమ్ టౌన్ సిరీస్ మొత్తం లో అందరి కంటే రాజీవ్ కనకాల కూతురిగా జ్యోతి పాత్రలో నటించిన యాని ఆకట్టుకుంది. మధ్య తరగతి అమ్మాయిగా ఈ పాత్ర తనకు సరిపోయింది. అంతే కాకుండా ఆ పాత్రలో బాగా నటించింది.
తనకు చదువుకోవాలని ఉన్నా, ఆడపిల్ల కు పెళ్లి చేసేయాలని తొందరపడే మధ్య తరగతి తల్లి తండ్రుల మాటలకు ఎదురు చెప్పలేని పాత్రలో యాని నటన సహజంగా ఉంది
ఇక్కడ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ని అనుకరించారు. అందువలనే ఈ హోమ్ టౌన్ వెబ్ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదు. ప్రేక్షకులు సూపర్ హిట్ అయిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తో పోల్చుకునే అవకాశాలు ఉన్నాయి.
శివాజీ, వాసుకి ల క్యారెక్టర్ లు కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. వాళ్ళ స్థానంలో రాజీవ్ కనకాల, ఝాన్సీ వచ్చారనిపిస్తుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ల మధ్య భావోద్వేగాలు అంతగా పండలేదు
90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ లో లాగా సంప్రదాయాని సుప్పిని ….. లాగా ఇందులో కూడా సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి కొత్తగా ప్రయత్నించారు. అయితే అది అంతగా ప్రభావం చూపలేదు
కధలో ప్రేక్షకులు లీనం అయ్యేలా నడిపించలేకపోయారు దర్శకుడు. ఈ హోమ్ టౌన్ సిరీస్ చూడగానే అందరికి 9090స్ మిడిల్ క్లాస్ బయోపిక్ గుర్తుకు రావడం కూడా ఈ వెబ్ సిరీస్ కు మైనస్ పాయింట్
బలాలు
మధ్య తరగతి జీవితాల చుట్టూ తిరిగే కధ కావడం
బలహీనతలు
భావోద్వేగాలు పండక పోవడం నిదానంగా సాగె కథనం నటి నటుల నటన అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం రెండవ ఎపిసోడ్ లో సింహభాగం స్వాతి వార పత్రికకు సంబంధించి నడవడం
మీకు బాగా టైం ఉంది ఏం చేయాలో తెలియకపోతే ఈ హోమ్ టౌన్ చూడండి లేదంటే మర్చిపోవచ్చు. ఇంకా చూడాలనిపిస్తే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ మరోసారి చూడండి

