నిన్న జరిగిన మాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 ఉంటుందని చెప్పారు. ప్రశాంత్ నీల్ సినిమా వలన దేవర 2 లేట్ అవుతోంది అన్నారు.
అసలు దేవర అంత పెద్ద హిట్ అయ్యిందా. నిజంగా 500 కోట్లు వసూలు చేసే కంటెంట్ ఉందా అందులో. మొదట్లో సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ విలువలు జోడించి తీసే కొరటాల శివ ఆచార్య తో గాడి తప్పాడు. దేవర సినిమాలో కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు. సముద్రపు బ్యాక్ డ్రాప్ అనే ఒక్క పాయింట్ తప్ప.
ముఖ్యంగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. జాహ్నవి కపూర్ పాత్రను సరిగా రాయలేకపోయాడు కొరటాల శివ. తెలుగు సినిమాలలో ఇంత వీక్ గా ఒక హీరోయిన్ క్యారక్టర్ డెబ్యూ సినిమాలో ఉండడం ఇదే మొదటిసారి
దేవర చివరలో బాహుబలి తరహా ట్విస్ట్ ఒకటి. దేవర పార్ట్ 2 కోసం పార్ట్ 1 తీసినట్లుగా. పాత చింతకాయ పచ్చడి లాంటి కధ, స్క్రీన్ ప్లే లతో బోర్ కొట్టించాడు కొరటాల శివ
దేవరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని ఫేక్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కంటెంట్ కు 500 కోట్లు ఎలా వచ్చాయి. అన్ని కోట్లు వసూలు చేసి హిట్ అయ్యిన దేవర సినిమాను టెలివిజన్ చానెల్స్ వాళ్ళు, ఎవరు ఎందుకు ఇప్పటిదాకా కొనలేదు. దేవర విడుదలై 6 నెలలు దాటినా ఇప్పటివరకు టెలివిజన్ లో ప్రసారం కాకపోవడానికి కారణం ఏమిటి.

