ఎన్టీఆర్‌ను మించినోడే లేడు.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by | Apr 5, 2025 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్ చేసిన వార్‌ 2 గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్‌ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ (NTR) నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హై ఇంటెన్సిటీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలాఉంటే.. తాజాగా హృతిక్ రోషన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్​ (Hrithik Roshan) తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో తన ఫేవరెట్ కో స్టార్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు హృతిక్ రోషన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఎన్టీఆర్ నా ఫేవరెట్ కో స్టార్ అని బదులిచ్చారు. ఎన్టీఆర్ నా ఫేవరెట్ కో స్టార్. నేను ఇటీవలే​ తనతో వార్ 2 సినిమా పూర్తి​ చేశాను. అత‌నొక అద్భుత న‌టుడే కాకుండా మంచి మ‌నిషి. ఈ జెనరేషన్ లో ఎన్టీఆర్ వంటి నటుడు మరొకరు ఉండరేమో.. వార్ 2లో అత‌డితో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉందంటూ హృతిక్ రోష‌న్ చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక వార్ 2 (WAR) మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుడ‌గా.. ఎన్టీఆర్ త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ని ఇప్ప‌టికే పూర్తి చేశాడు. అయితే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చాడు హృతిక్ రోష‌న్. వార్ 2 సినిమాను ఆగ‌ష్టు 14న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/HrithikRules/status/1908359623544910031