రవితేజ- కిషోర్ సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్‌

by | Apr 5, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మే 9న సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘చిత్రలహరి’ వంటి క్లాస్‌ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న డైరెక్టర్ కిశోర్‌ తిరుమలతో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు మేకర్స్. దర్శకుడు కిషోర్ తిరుమల ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై రవితేజ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. ఇక షూటింగ్‌ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 6న శ్రీరామనవమి పండుగ సందర్భంగా రవితేజ-కిషోర్ తిరుమల (Kishore Tirumala) సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానున్నట్లు సమాచారం. హైద్రాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటుగా పలువురు స్టార్స్‌ పాల్గొంటారని తెలుస్తోంది.

ఇందులో హీరో రవితేజ (Ravi Teja) తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కయాదు లోహర్, మమతా బైజు ఎంపికయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇక రవితేజ లాంటి మాస్ హీరో కిషోర్ తిరుమల వంటి క్లాస్ డైరెక్టర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడట కిషోర్ తిరుమల. ఈ సినిమాలో రవితేజను సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అనార్కలి’ (Anarkali) అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ప్రముఖ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది.