ముంబై ఇండియన్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్

by | Apr 5, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో  విజయం సాధించింది

204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 17 పరుగులకే ఓపెనర్లు విల్ జాక్స్,  రికెల్టన్ ల వికెట్లను కోల్పోయింది.  విల్ జాక్స్ 5 పరుగులు ,  రికెల్టన్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు 

ఆ తరవాత వచ్చిన నామన్ ధిర్, సూర్య కుమార్ యాదవ్ లు మూడవ వికెట్ కు 69 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన నామన్ ధిర్ 24 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాక వచ్చిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ తో కలిసి నాలుగవ వికెట్ కు 66 పరుగులు జోడించారు

43 బంతుల్లో 67 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ అవుట్ అవడం, కాసేపటికే 25 పరుగులు చేసిన తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్  కావడం వెంట వెంటనే జరిగిపోయాయి

కెప్టెన్ హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 28 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి విజయానికి 12 పరుగుల దూరం లో ఆగిపోయింది

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రతి లు తలా ఒక వికెట్ తీశారు

నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నామన్ ధిర్ వికెట్ ను తీసుకున్న దిగ్వేశ్ రతి కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

అంతకు ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది

లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్ లు మొదటి వికెట్ కు 76 పరుగులు జోడించారు

మిచెల్ మార్ష్ ధాటిగా ఆడి 31 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తరవాత వచ్చిన, నికోలస్ పూరన్ 12 పరుగులు చేసి అవుట్ అవగా, రెండు పరుగులు చేసిన కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు.

మార్క్రమ్, బదోని లు నాలుగవ వికెట్ కు 51 పరుగులు జోడించిన అనంతరం 19 బంతుల్లో 30 పరుగులు చేసిన ఆయుష్ బదోని అవుట్ అయ్యాడు.  ఆ తరవాత మార్క్రమ్ 38 బంతుల్లో 53 పరుగులు, , మిల్లర్ 14 బంతుల్లో 27 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 200 పరుగులు దాటింది

ముంబై ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు తీయగా, విగ్నేష్ పుతూర్, బౌల్ట్, అశ్వని కుమార్ లు చెరో ఒక వికెట్ తీశారు