జయకేతనం సభలో నాగబాబు స్పీచ్ పవన్ కల్యాణ్ కొంప ముంచుతుందా?!
ఈ రోజు పిఠాపురం పర్యటించిన నాగబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు
ఈ కార్యక్రమాలకు పిఠాపురం మాజీ ఏం ఎల్ ఎ వర్మ దూరంగా ఉన్నారు. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు పోటా పోటీగా జై జనసేన, జై తెలుగు దేశం అనే నినాదాలతో హోరెత్తించారు. దీనికి కారణం జయకేతనం సభలో నాగబాబు స్పీచ్.
పిఠాపురంలో పవన్ కల్యాణ్, వర్మ ల మధ్య దూరం పెరుగుతోంది. పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో అందరితో కలిసిపోయి పని చేస్తుంటే, నాగబాబు వలన తెలుగుదేశం, జనసేన పార్టీ ల మధ్య దూరం పెరిగేలా ఉంది. ముందు, ముందు ఈ పరిణామాలు ఎంత దూరం వెళతాయో చూడాలి. ఈ పరిణామాలను వైస్సార్సీపీ పార్టీ అవకాశంగా మలుచుకోవచ్చు
తెలుగు దేశం పార్టీ అవసరం జనసేనకు ఉంది, అలాగే జనసేన పార్టీ కు తెలుగు దేశం అవసరం ఉంది. నాగబాబు మాటల మీద కన్నా, పని మీద దృష్టి పెడితే బావుంటుంది. నాగబాబు మంచి చేయకపోయినా పరవాలేదు కాను, పవన్ కల్యాణ్ కు, జనసేన కు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. కూటమి ధర్మాన్ని మరువ కూడదు
అసలు ఆరోజు నాగబాబు ఏం మాట్లాడారో చూద్దాం
జనసేన 12 వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ అధికారం లోకి వచ్చాక జాగ్రత్తగా మాట్లాడాలి, అధికారం ఉంది కదా అని అహంకారంతో మాట్లాడితే ఏమవుతుంది, దాని తరవాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూస్తున్నాం అని అన్నారు
అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అన్న నాగబాబు, అదే సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని హాస్య నటుడు అని అభివర్ణించారు
అదే సభలో నాగబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గారు మమ్మల్ని పిఠాపురం లో పని చేయమన్నారు. పిఠాపురం లో పని చేసేటప్పుడు మాకు ఒకటి అర్ధమయ్యింది అదేంటంటే పవన్ కల్యాణ్ గారి గెలుపు పిఠాపురంలో ఖాయమైంది అని.
అంతే కాకుండా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే రెండవ కారణంగా పిఠాపురం జన సైనికులు, పౌరులు, ఓటర్లు అని చెప్పారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఎవరైనా నేనే దోహద పడ్డాను అని అనుకుంటే అది వారి ఖర్మ అని అన్నారు. ఈ మాట సూటిగా పిఠాపురం మాజీ ఏం ఎల్ ఏ వర్మకు తగిలింది.


