ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్ లు మొదటి వికెట్ కు 76 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ ధాటిగా ఆడి 31 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన, నికోలస్ పూరన్ 12 పరుగులు చేసి అవుట్ అవగా, రెండు పరుగులు చేసిన కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు.
ఆ తరవాత వచ్చిన బదోని తో జత కలిసిన మార్క్రమ్, నాలుగవ వికెట్ కు 51 పరుగులు జోడించిన అనంతరం 19 బంతుల్లో 30 పరుగులు చేసిన ఆయుష్ బదోని అవుట్ అయ్యాడు. ఆ తరవాత మార్క్రమ్ 38 బంతుల్లో 53 పరుగులు, మిల్లర్ 14 బంతుల్లో 27 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 200 పరుగులు దాటింది
ముంబై ఇండియన్స్ బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు తీయగా, విగ్నేష్ పుతూర్, బౌల్ట్, అశ్వని కుమార్ లు చెరో ఒక వికెట్ తీశారు

