‘డ్రాగెన్’ స్పెషల్ సాంగ్- ఎన్టీఆర్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరోయిన్!

by | Apr 4, 2025 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ (Dragon) అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కూడా ఉందట. దాని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్‌ సాంగ్‌ని మరింత స్పెషల్‌ చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ని బరిలోకి దింపబోతున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సాంగ్ కోసం చిత్ర బృందం శ్రద్దా కపూర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు శ్రద్దా కపూర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, శ్రద్దా కపూర్ కలయికలో రాబోతున్న స్పెషల్‌ సాంగ్‌ ఎలా ఉంటుందో చూడాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభమయ్యే శ్రీలంక షెడ్యూల్​లో హీరో ఎన్టీఆర్ (NTR) కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2026, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.