ట్రంప్ సుంకాల ప్రభావం భారతీయ కంపెనీల ఆదాయాలపై!

by | Apr 4, 2025 | ప్రగడ టీవీ

అమెరికా నుండి అధిక ఆదాయం పొందుతోన్న ఇండియన్ కంపెనీలు

అమెరికా నుండి ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయ కంపెనీ లు చాలానే ఉన్నాయి. అందులో టాప్ 25 కంపెనీలు ఏమున్నాయో చూద్దాం.

వీటిలో ఎక్కువగా ఫార్మా మరియు సాఫ్ట్ వేర్ సర్వీసెస్ కంపెనీ లు ఉన్నాయి.  ట్రంప్ ఏమనుకున్నాడో ఏమో ఫార్మా రంగానికి ఈ సుంకాల నుండి మినహాయింపు ఇచ్చాడు

అమెరికా ప్రజలకు తక్కువ ధరలో మందులు అందించడం లో మన ఫార్మా కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మన దేశం నుండి దాదాపుగా 9 బిలియన్ డాలర్ల మందులు అమెరికా కు ఎగుమతి అవుతాయి. కాబట్టి ఈ మందులపై సుంకాలు విధిస్తే ఇది అమెరికా ప్రజల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.  అందుకే ట్రంప్ ఫార్మా రంగం జోలికి వెళ్ళలేదు.

ఇక సాఫ్ట్ వేర్ సర్వీసెస్ రంగానికి వస్తే ఈ రంగం పై ప్రత్యక్ష సుంకాలు ఏమి లేవు కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అమెరికా కొత్త పాలసీ లకు అనుగుణంగా ప్రైసింగ్ స్ట్రాటజీ, ఆపరేషన్స్ స్ట్రాటజీ లతో, మార్కెట్ కు అనుగుణం గా కంపెనీ లను రెడీ చేయాలి

ట్రంప్ సుంకాల వాళ్ళ అంత పెద్ద ప్రమాదం ప్రస్తుతానికి ఏమి లేదు కానీ అప్రమత్తంగా ఉండడం అవసరం.  అమెరికా సుంకాల వలన మన జి డి పి వృద్ధి 0.3% నుండి 0.6% తగ్గవచ్చు అని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు

S NoCompanySectorRevenue from USA
1Sagility IndiaBusiness Support100%
2Birla SoftSoftware Services85.7%
3MphasisSoftware Services81.43%
4Granules IndiaPharmaceuticals77%
5eClerx ServicesSoftware Services76%
6Natco PharmaPharmaceuticals70.49%
7Avanti FeedsFMCG69%
8Zensar TechnologiesSoftware Services67.3%
9First Source SolutionSoftware Services66.3%
10HCL Tech.Software Services65.5%
11Syngene InternationalBusiness Support64.66%
12WiproSoftware Services62.68%
13CoforgeSoftware Services56.0%
14Gland PharmaPharmaceuticals52.69%
15Marksans PharmaPharmaceuticals51.8%
16Tech MahindraSoftware Services50.8%
17Dr Reddy’s LabPharmaceuticals48.56%
18Aurobindo PharmaPharmaceuticals45.3%
19Zydus LifesciencesPharmaceuticals44.89%
20Bharat ForgeForging & Casting44.33%
21BioconPharmaceuticals43.75%
22Neuland LaboratoriesPharmaceuticals39.54%
23TridentTextiles39.28%
24LT FoodsFMCG38.53%
25LupinPharmaceuticals38.00%