ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏమైంది. హ్యాట్రిక్ ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీల్ 2025 సీజన్ ను భారీ స్కోర్ చేసి విజయం తో ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్ లలో సన్ రైజర్స్ స్కోర్ 200 పరుగుల లోపే ఉంది
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద 190 పరుగులు చేసింది.
ఆ తరవాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 18.4 ఓవర్ల లో 163 పరుగులకు అల్ అవుట్.
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంకా దారుణం 16.4 ఓవర్ల లో 120 పరుగులకు అల్ అవుట్
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ చేరిన జట్టు. అరివీర భయంకరమైన పవర్ హిట్టర్ లు ఉన్న జట్టు. కానీ గెలవడానికి ఆపసోపాలు పడుతోంది. కనీసం 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోతున్నారు
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఇప్పటిదాకా ఈ సీజన్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఏ జట్టును అల్ అవుట్ చేయలేదు. ప్రత్యర్థి జట్టు 5-6 వికెట్లు మాత్రమీ తీయగలుగుతున్నారు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ … పేరుకే ఐదుగురు పవర్ హిట్టర్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ ల లో అల్ అవుట్ అయ్యింది. ఒక మ్యాచ్ లో 9 వికెట్లు కోల్పోయింది
సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ క్యాప్టిల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు 16 ఓవర్లలోనే ఛేదించాయి అంటే సన్ రైజర్స్ బౌలర్ల బౌలింగ్ ఎంత గొప్పగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు
బౌలింగ్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లలో కాకుండా ఫీల్డింగ్ లో కూడా తడబడుతోంది. క్యాచ్ లు వదిలేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విఫలమవుతోంది
ఇవే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి హెచ్ సి ఎ తో వివాదం… సద్దుమణిగిందనుకోండి.
నాలుగు మ్యాచ్ లు ఆడి హ్యాట్రిక్ ఓటములతో -1.61 నెట్ రన్ రేట్ తో ముందుకు వెళ్ళాలి అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాలలో సన్ రీసెర్స్ హైదరాబాద్ జట్టు రైజ్ అవ్వాల్సిందే.

