గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది (Peddi) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన (Upasana) లు దర్శకుడు బుచ్చిబాబు కు అద్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు
ఇంతకీ రామ్ చరణ్ దంపతులు ఇచ్చిన గిఫ్టులు ఏంటంటే హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పుస్తకం, హనుమంతుడి విగ్రహం. ఈ గిఫ్టులు పంపిస్తూ నా మనసులో నీకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి అశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను అని రాసిన ఒక నోట్ తో పాటు శ్రీ రాముని పాదుకలను కూడా పంపారు. ఏప్రిల్ 6 శ్రీ రామ నవమి వస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా రామ్ చరణ్ ఆంజనేయస్వామి భక్తుడు అని కూడా మనందరికీ తెలిసిన విషయమే
రామ్ చరణ్ (Ram Charan) దంపతులు ఇచ్చిన ఈ బహుమతులను ఎక్స్ వేదికగా బుచ్చిబాబు (Buchibabu) షేర్ చేస్తూ ఈ అద్భుతమైన కానుకలకు, రామ్ చరణ్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా బుచ్చిబాబు ఇంకా ఈ విధంగా రాసుకొచ్చారు
మీ ప్రేమ మరియు మద్దతుకు రుణపడి ఉన్నాను’. హనుమంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉండుగాక మరియు మీకు మరింత బలాన్ని మరియు శక్తిని ఇస్తాయి సార్…మీ విలువలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ స్థిరంగా మరియు వినయంగా ఉండాలని మాకు గుర్తు చేస్తాయి.



https://twitter.com/BuchiBabuSana/status/1908008651639652463

