సింగల్ నుండి ‘శిల్పి ఎవరో…’  లిరికల్ వీడియో సాంగ్ ని చూశారా

by | Apr 4, 2025 | సినిమా

శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్ లుగా వస్తోన్న చిత్రం సింగల్. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు

కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి లు నిర్మిస్తున్నారు

ఈ చిత్రం నుండి శిల్పి ఎవరో ఈ శిల్పమెనుక అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు. శ్రీమణి రాసిన ఈ పాటను యజిన్ నిజర్ పాడాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం వినసొంపుగా ఉంది

ఈ సినిమా పేరు సింగల్ కానీ కధానాయకుడు ఇద్దరు హీరోయిన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు