Prabhas Impressed.. ‘ఫౌజీ’ డైరెక్టర్‌తో మరో మూవీ ప్లాన్!

by | Apr 4, 2025 | సినిమా

తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వీ అనే యంగ్​ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఫౌజీలో ఇమాన్వి తోపాటు మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పఠానీ ఎంపికైనట్లు తెలుస్తోంది. కాగా, 1940ల్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు హను రాఘవపూడి పనితనం ప్రభాస్‌కు (Prabhas) బాగా నచ్చిందట. డైరెక్షన్ లో అతని నైపుణ్యంతో పాటుగా, మేకింగ్‌ స్టయిల్ కి ప్రభాస్ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడని ఓ వార్త టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీంతో ‘ఫౌజీ’ (Fouji) సినిమా పూర్తికాకముందే హను రాఘవపూడితో మరో సినిమా చేస్తానని క్రేజీ ఆఫర్‌ ఇచ్చాడని సమాచారం.

ఈ చిత్రం లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుండగా.. ప్రభాస్‌ లవర్ బాయ్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఏమి లేకుండా స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభాస్ ఓ అగ్ర నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆ నిర్మాణ సంస్థతో దర్శకుడు హను రాఘవపూడికి అడ్వాన్స్‌ కూడా ఇప్పించాడని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ మరో మూవీ సిల్వర్ స్క్రీన్‌పై మెరువడం ఖాయమైనట్టే అని చెప్పొచ్చు. ‘ఫౌజీ’లో ప్రభాస్ ను వారియర్ గా చూపిస్తున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi) మరి ప్రేమకథలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ‘ఫౌజీ’ సినిమాను చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథాంశంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.