ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత

by | Apr 4, 2025 | సినిమా

కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోన్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ముంబై లోని కోకిల బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ వయసు 87 సంవత్సరాలు

40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించారు. ఎక్కువగా దేశ భక్తి చిత్రాలు తీసేవారు. మనోజ్ కుమార్ 1967 తీసిన ఉపకార్ చిత్రంతోనే ఆయనకు భారత్ కుమార్ అనే పేరు వచ్చింది

1965 లో షాహీద్, 1970 లో పూరబ్ ఔర్ పశ్చిమ్ ఇంకా క్రాంతి, పత్తర్ కె సనమ్, మేరా నామ్ జోకర్,గుమ్నామ్, షోర్, ఓహ్ కౌన్ తీ అనే చిత్రాలు మనోజ్ కుమార్ కు బాగా పేరు తెచ్చి పెట్టాయి. 1974 లో అమితాబ్ బచ్చన్ తో తీసిన రోటి కపడా ఔర్ మకాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది

నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మనోజ్ కుమార్ ను 1992 లో పద్మశ్రీ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించగా, 2015 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మనోజ్ కుమార్ ని వరించింది.

మనోజ్ కుమార్ మృతి పై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తన సంతాపాన్నితెలిపారు